ద్వాదశ జ్యోతిర్లింగాలు
ఈ లలితా పీఠంలో అన్నింటి కంటె ప్రత్యేక వైశిష్ట్యాన్ని ప్రదర్శిస్తున్నాయి ఈ ద్వాదశజ్యోతిర్లింగాలు .మాకు తెలిసి భారతదేశములో ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎన్నో చోట్ల ఏర్పాటు చేసియున్నారు.కాని వాటి ఆకృతి విశేషాలను శివలింగాల సైజుని , పానవట్టముల ఆకృతులను అనుసరించి ఏర్పాటు చేయలేదనునది జగమెరిగిన సత్యమే.కాని మన లలితా పీఠంలో వాటన్నింటినీ పరిశీలించి , పరిశోధించి జ్యోతిర్లింగముల క్షేత్రాలలో ఏ విధంగా స్వామి వార్లు దర్శనమిస్తారో తదనుగుణమైన నమూనాలను తాయారు చేసి నూటికి తొంభై శాతం భక్తులకు అనుభూతిని కలిగిస్తున్నామనటంలో అతిశయోక్తి లేదనుకుంటున్నాము.