అష్టాదశ శక్తిపీఠాలు
శ్రీ లంక మొదలుకొని మన దేశములో పలుచోట్ల వెలసిన అష్టాదశ శక్తిపీఠాలను దర్శించలేని భక్తులకు అన్ని పీఠాలను ఒకే చోట దర్శించే మహాభాగ్యం ఈ లలితాపీఠంలో చిక్కుతుంది. ఈ మూర్తులు అత్యంత సుందరముగా మిక్కిలి ఆకర్షణగా శ్వేతశిలలో తాయారు చెయబడి ప్రతినిత్యం దర్శించుకొనే భక్తులన్దరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. అంతేకాక శ్రీ రామ, శ్రీ కృష్ణ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ ఆంజనేయ, కాలభైరవ, కన్యకాపరమేశ్వరి, ఆదిశంకరుల శ్వేత శిలామూర్తులను దర్శించికూడా దర్శించి భక్తులు ఆనంద పరవశులౌతారు . అట్లే ఈ దేవి దేవతులను దర్శిస్తూ వచ్చే సమయంలో భక్తిపారవశ్యంతో శివుని ఆలింగనము చేసుకొని యముని దిక్కరించి మృత్యుంజయుడైన భక్తమర్కండేయుని భక్తులు దర్శించవచ్చు.