గలగల ప్రవహించే గంగమ్మ
ఏ నిర్మాణమునకు చుట్టూ జలప్రవాహ ముంటుందో అట్టి దానికి ఎట్టి వాస్తు దోషములు అంటవని వాస్తుశాస్త్రము చెపుతుంది. మన శ్రీలలితాపీఠంలో ఒకవైపు సింహపుముఖ ద్వారంలో ప్రవేశించగానే ఒకవైపు అష్టాదశ శక్తిపీఠములు, ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనంతో భక్తి పారవశ్యంలో మునుగుతున్న భక్తులకు రెండవ వైపు హంసముఖములనుండి, ఏనుగుల తొండాల నుండి, గోముఖాలనుండి, చిన్నకొండల గుట్టలనుండి కాలువలవైపు దూకుతూ గలగలశభ్ధముతో ప్రవహించే గంగమ్మ సవ్వడులు నయనానందకరంగా, హృదయాహ్లాదకరంగా ఉంటుంది సుమా. ఇట్లా అన్నింటిని దర్శిస్తూ ఆనందిస్తూ మరొక సింహపు ముఖద్వారము నుండి బయటకు వచ్చినంతనే దివి నుండి భువికి దిగి వచ్చామా అన్నట్లు అనిపిస్తుంది.
భక్తులు ప్రధాన దేవాలయంలోనికి ప్రవేశించే ముందు ముఖమండపానికి ఇరువైపులా లక్ష్మి, సరస్వతుల దివ్యమూర్తులు దర్శనమిస్తుంటారు ముఖమండపములో ప్రవేశించగానే ఒక అద్భుత రూపం దర్శనమిస్తుంది అదే నంది, సింహం రెండు ఏకశిలలోనున్న అరుదైన రూపం. పరమశివుని వాహనము నందీశ్వరుడైతే అమ్మ సింహవాహిని కదా. వారిరువురు గర్భగుడిలో నుండగా వారిరువురినీ ధ్యానిస్తూ మీ అర్ధనారీశ్వర స్వరూపానికి మేమేమీ తగ్గిపోమంటూ అర్ధార్ధ శరీరాలను ధరించి కనిపిస్తున్న నంది, సింహ వాహనములు ఒకటై భక్తులకి ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఆ మండపము నుండి కుడి చేతి వైపుగానున్నభూగర్భములోనికి దిగితే ఒక దివ్యానుభూతిని కలిగించే గుహ మనకు దర్శనమిస్తుంది. అదే వశిష్ఠ గుహ. ఈ గుహలో త్రేతాయుగములో పదునారుఏండ్ల ప్రాయములో సంపూర్ణ వైరాగ్యాన్ని పొందిన శ్రీ రామచంద్రమూర్తికి 24,000 శ్లోకాల పరిమితి కలిగిన ఆధ్యాత్మిక ప్రభోధాన్ని అందించారు వశిష్ఠ మహర్షులువారు. దానికి ప్రతీకగా వశిష్ఠ శ్రీ రామచంద్రుల గురుశిష్య సన్నిధాన దృశ్యాన్ని భక్తులు దర్శించి పరవశించి పోతున్నారు. ఆ గుహలో కనిపిస్తున్న ద్వారాన్ని తెరిస్తే వాతనుకులమైన ధ్యానమందిరం అందులో ఎదురుగా “ ఓం కారం” కంటికి కనిపిస్తుంటే “ ఓం కారనాదం” చెవికి వినిపిస్తూవుంటే తన్మయత్వంతో భక్తులు ధ్యానం చేస్తూ ఒక మధురానుభూతిని పొందుతూ ఉంటారు.