మరకత లింగం
పరమ శివుని ప్రతిరూపమైన శివ లింగార్చన సర్వ శుభప్రదమైనదిగా శాస్త్రాలలో కీర్తింపబడింది.అందులోను శిలాలింగము సర్వసిద్ధి ప్రదమని మోక్ష ప్రదమని పురాణాదులలో కీర్తింపబడింది. అందులోను మరకత లింగము ఐశ్వర్య ప్రదము , జ్ఞాన ప్రదమైనదని కీర్తింపబడింది.అంటే ఎవరు మరకత లింగాన్ని అర్చిస్తారో అట్టి వార్కి ఇహము , పరము రెండు లభిస్తాయని శాస్త్ర ప్రమాణము.సామాన్యంగా ఏ దేవాలయములోను లేని ఈ మరకత లింగరూపుడైన పరమేశ్వరుని సేవించే భాగ్యం మనకి లభించడం పూర్వజన్మ సుకృతమే సుమా.