శ్రీ లలితా పీఠ నిర్మాణ సంకల్పము
2007 వ సంవత్సరంలో నైమిశారణ్యంలో తృతీయ కార్తీక జ్ఞాన జ్యోతి కార్యక్రమాన్ని సంకల్పించి సుమారు 200 మంది భక్తులతో భాగవతసప్తాహం , ఆధ్యాత్మిక ప్రవచనాలు , సప్తర్షిపూజ , లలితా సహస్రనామ పారాయణలు , వివిధ యజ్ఞములు , పూజా కార్యక్రమాలు , జప ధ్యానములు అత్యంత భక్తీ శ్రద్ధలతో నిర్వహించబడినవి.అచ్చట కార్యక్రమాన్ని పూర్తి చేసికొని తిరుగు ప్రయాణములో అయోధ్యలో శ్రీ రామ చంద్రుని దర్శించి కాశీ క్షేత్రాన్ని చేరుకొన్నాము.ఆనాటికి కొన్ని సంవత్సరాలుగా శ్రీ వశిష్ఠాశ్రమములో నిర్మింపబడే పార్వతిపరమేశ్వరుల దేవాలయం ఒక ప్రత్యేక నిర్మాణ శైలిలో దర్శించే భక్తులకు ఆనందాతిశయాన్ని ఆశ్చర్యాన్ని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేదిగా ఉండాలని మనస్సు తపిస్తూ వుండేది.ఆ తపనకు పార్వతి పరమేశ్వరులు సంకల్పం జోడై కాశీ క్షేత్రంలో మొదటి రోజు గంగాస్నానం , విశ్వేశ్వరుని దర్శనం , అన్నపూర్ణ ,విశాలాక్షి అమ్మ వార్ల దర్శనాలు చేసుకొని భక్తులందరం ముముక్షుభవన్ లో రాత్రికి విశ్రాంతి తీసుకొన్నాము.మర్నాడు బ్రాహ్మీముహూర్తకాలములో ఒక దివ్యమైన సుందరమైన మందిర నిర్మాణ స్ఫురణ కలగటం పార్వతి పరమేశ్వరుల దివ్యానుగ్రహమే .
షుమారు తెల్లవారుఝామున 04:30 గం||ల సమయములో ఆ ఆలోచన స్ఫురించటంతో వెంటనే లేచి కాగితము , కలము తీసుకొని ఆ స్ఫురించిన నమునాను కాగితం పై పెట్టడం జరిగింది.ఆనాడు స్పురించిన విధానమేమిటంటే ఒక హిమాలయ పర్వతం , ఆ పర్వతంలోకి ప్రధాన ద్వారం గుండా వెళ్తే అందులో శ్రీ చక్రమేరు ఆకృతి విశేషములో ఉండే గర్భాలయము , అందులో జగన్మాత లలితాపరమేశ్వరి , పరమేశ్వరుని యొక్క శివలింగస్వరూపం ఉండగా , అదే పర్వతంలో ఈ దేవాలయానికి చుట్టూ సింహముఖాకృతిలోనున్న కొండ గుహలో ప్రవేశించగా , ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనమిస్తూ యుండగా , అటు ప్రక్కనే కొండవాగులలో నుండి కొండకి చుట్టూ ప్రవహిస్తున్న జలప్రవాహం కలిగి వుండేటట్లుగా,కొండ శిఖరముపై ప్రణవ ధ్వజము , దానికి క్రిందుగా ధ్యానమూర్తిగా శివుడు , శివుని జటాజూటాము నుండి జాలువారే గంగ ఉన్నట్లు రూపకల్పన చేసి , దానిని మాతో వచ్చిన ముఖ్యభక్తులకు కూడ చూపించటం జరిగింది.ఇది ఆనాటి అనుభూతి
దీనికి అనుకూలముగా నాకు చేతనైనంత పరిధిలో డిజైన్ గీసి దానిని మంచి అనుభవం కలిగిన స్థపతి ద్వారా డిజైన్ చేయించాలని సంకల్పించాను.ఈ దిశలో ప్రయాణించగా ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మదాయ శాఖ కు చెందిన అప్పటి ప్రధాన స్థపతులైన శ్రీ మాన్ సుందరరాజన్ గారితో దాన్ని డిజైన్ చేయించి ఆశ్రమంలో ఒక నమూనా దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది.తరువాత ఈ నిర్మాణం చేయటానికి “ఫెర్రోసిమెంటు టెక్నాలజీ ” సరియైనదని ఇంజనీర్ శివరామకృష్ణ గారు (ఒంగోలు) సూచించగా ఈ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టే ఇంజనీర్లు ఆంధ్రప్రదేశ్లో లేరనే విషయం తెలుసుకుని పూణే నుండి గోయంకా (ఇంజనీర్) గారిని పిలిపించి విచారించగా ఇంత బృహన్నిర్మాణము ఫెర్రో సిమెంటు టెక్నాలజీతో చేయటం కష్ట సాధ్యమని , లీకేజి ఇబ్బందులు ఎదుర్కొనవలసి వుంటుందని తెలుసుకొనటం జరిగింది.ఈ విషయాలన్నిటినీ పరిశీలించి కొన్ని కొన్ని మార్పుల చేర్పులతో , ప్రస్తుత శ్రీ లలితాపీఠ నిర్మాణం జరిగినది.ఇదంతా ఆ పార్వతీపరమేశ్వరుల దివ్య సంకల్పమే సుమా !