శ్రీ లలితా పీఠ వైశిష్ట్యము
శ్రీ లలితాపరమేశ్వరి : శ్రీ చక్రమేరువు గోపురముగా నిర్మింప బడిన గర్భాలయంలో కృష్ణ శిల మూర్తిగా ప్రతిష్టింపబడిన 63 అంగుళములు ఎత్తు గలిగిన మూర్తిగా అవతరించిన అమ్మ వారు సాక్షాత్తు సర్వాలంకారభూషితమై మందహాసము చిందిస్తూ భక్తులననుగ్రహిస్తూ వుండటం దర్శనార్ధులై వచ్చిన భక్తులకు ఒక అద్భుత అనుభూతిగా ఉన్నదనుటలో అతిశయోక్తి లేదు.
లక్ష శ్రీ చక్రాల ప్రతిష్ఠ
శ్రీ లలితా పీఠంలో మూలవిరాట్ గా విరజమానమై భక్తులననుగ్రహిస్తున్న జగన్మాత శ్రీ లలితా పరమేశ్వరి అమ్మ వారి పీఠమునకు క్రిందిభాగములో లక్ష సంఖ్యాత్మక శ్రీ చక్రాలు ప్రతిష్ఠింపబడిన మహాశక్తివంతమైన పీఠం ఈ లలితాపీఠం.
అట్టి ఈ పీఠంలో శ్రీచక్రమేరువునకు త్రిసంధ్యలలో అర్చన జరుగుతూ వుండటం ఒక గొప్ప విశేషం.ముందుగానే శ్రీ చక్రమేరువు , వెనుక మరకతలింగము , ఆ వెనుక శ్రీ లలితాపరమేశ్వరి , అమ్మ వారికి చెరొక వైపు విఘ్నేశ్వర ,సుబ్రహ్మణ్యేశ్వరులు కలిగిన విశిష్ట ఆలయం ఈ లలితా పీఠం.ఇట్టి గర్భగుడికి శ్రీ చక్ర మేరువు ఆకృతిలో గోపురం రూపుదిద్దుకొనగా అట్టి శ్రీ చక్రమేరువు గోపురమునకు ఆచ్చాదనమై పిరమిడ్ ఆకృతిలో పై గోపురం రూపుదిద్దుకొని ప్రకృతి శక్తిని కేంద్రీకృతం చేస్తూ ఈ పీఠంలో ప్రవేశించిన భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది అనటంలో లోనికి ప్రవేశించిన భక్తుల అనుభూతియే ప్రత్యక్ష ప్రమాణమై యున్నది.
ఈ దేవాలయములో అమ్మ వారి విశ్వరూపానికి ప్రతీకంగా వెలసిన నవదుర్గలు : 1) శైలపుత్రి 2) బ్రహ్మచారిణి 3) చంద్ర ఘంట 4) కూష్మాండ 5) స్కందమాత 6) కాత్యాయిని 7) కాళరాత్రి 8) మహాగౌరి 9) సిద్ధిధాత్రి
అష్టలక్ష్ములు : 1) ఆదిలక్ష్మి 2) ధాన్యలక్ష్మి 3) వీరలక్ష్మి 4) గజలక్ష్మి 5) సంతానలక్ష్మి 6) విజయలక్ష్మి 7) ఐశ్వర్యలక్ష్మి 8) ధనలక్ష్మి
అష్టాదశభుజదుర్గ,గాయత్రీమాత,ప్రత్యంగిరా దేవి,గంగా మాత,అర్ధనారీశ్వరుడు,లింగోద్భవ ఎంబోజింగ్ మూర్తులను చెప్పటం కాదు దర్శించి ఒక మధురానుభూతిని పొందవలసిందే.ఇకపోతే గర్భగుడికి ఆగ్నేయ,ఈశాన్య భాగాలలో ఉన్న శ్రీ వ్యాసాశ్రమ సంస్థాపకులు స్త్రీ,శూద్ర జనోద్ధారకులు ఆంధ్ర దేశోద్ధారకులు అపరగౌతమబుద్ధులు , గీతాపితా మహులుగా కీర్తింపబడిన మహర్షి సద్గురు శ్రీ మలయాళస్వాముల వారి , అట్లే వారి సాక్షాత్ శిష్యులు శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠులు , సద్గురువులు , ఆస్మత్ గురుదేవులైన పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ విద్యానంద గిరి స్వాముల వారి మూర్తులను చూడగానే ప్రత్యక్షముగా పూజ్య స్వామిజి లను దర్శించిన అనుభూతిని భక్తులు పొందుతున్నారనటంలో అతిశయోక్తిలేదు.ఇది శ్రీ లలితాపీఠం యొక్క దివ్య భవ్య సుందర స్వరూపం . సత్య శివ సుందర స్వరూపం .ఇట్టి మంగళ ప్రదమైన పీఠాన్ని దర్శించి తరించండి.