సూర్య రశ్మి
శివాలయంలో కనీసం సంవత్సరానికి ఒక మారైన సూర్య రశ్మి గర్భాలయంలో ప్రవేశించి శివుని స్ప్రుశించాలని శాస్త్రాల పెద్దలమాట.సూర్యుడు , అగ్ని మొదలైన తత్వాలు ప్రకృతిలోని వాస్తు దోషాలను తొలగించి పవిత్రతను చేకూర్చే దేవాతామూర్తులుగా మనం ఆరాధిస్తూ వుంటాము.అందువలన గర్భాలయాన్ని దేవతామూర్తులను మనం ఆరాధిస్తూ వుంటాము.అందువలన సంస్కారంతో గర్భాలయాన్ని దేవతామూర్తులను ఎట్లాగున మనం శుద్ధం చేస్తూ వుంటమో అట్లే అగ్ని సంస్కారంతో కూడ పలువిధాలశుద్ధి కార్యక్రమాలు జరుగుతూ వుంటాయి.గర్భగుడిలో దీప ప్రజ్వలన కార్యము ద్వారా అంధకారాన్ని నిర్మూలించి భగవద్దర్శన భాగ్యం ద్వారా గర్భాలయం , భక్తుల హృదయాలయం కూడా శుద్ధమౌతుంది .అట్లే దేవాలయంలో జరిగే యజ్ఞయాగాది కార్యక్రమాల ద్వారా , అగ్ని హృదయ శుద్ధిని , ప్రకృతి శుద్ధిని పరమాత్మ సిద్ధిని కలిగిస్తుంది.ఇకపోతే సర్వశుద్ధికరుడైన సూర్యభగవానుని ప్రవేశించడం మంచిదంటారు.మహాత్తని చెప్తుంటారు.కానీ మన లలితాపీఠంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో మొదటి మూడు నెలలు ప్రతి నిత్యము గర్భగుడిలో సూర్య కిరణాలు సోకటం ఒక అపురూప విషయమే.ఈ మూడు నెలలలో సంక్రాంతి నుండి 7 రోజులు సాక్షాత్తు అమ్మ వారి పైన , శివుని పైన సూర్య రశ్మి పడటం ఇంకా విశేషం.ఈ సన్నివేశాన్ని సుమారు ఉదయం 6 గం||లు నుండి 9 గంటల మధ్యలో భక్తులు దర్శించవచ్చు