ప్రకృతి సంపద
శ్రీ వశిష్ఠాశ్రమ విస్తీర్ణం షుమారు మూడు ఎకరములు . ఈ ఆశ్రమ ప్రాంగణం యొక్క వైశిష్ట్యమేమంటే ఇది ప్రకృతి సంపదకు పుట్టినిల్లు.ఈ ప్రాంగణంలో నిత్యజీవనానికి , నిత్యారాధనకు ఉపయోగపడే ఫలపుష్పభరితమైన వృక్షసంపదయే తప్ప నిరర్ధకమైన ఏ చెట్టుకానరాదు.ఆశ్రమ ప్రధాన ముఖద్వారములో ప్రవేశిస్తూనే భక్తులందరిని స్వాగతిస్తూ కనిపిస్తాయి కదళీ వృక్షాలు.లలితా పీఠం చుట్టూ నవగ్రహ (అత్తి,మోదుగ , తెల్లజిల్లేడు, చంద్ర, గరిక , జమ్మి , దర్భ , రావి , ఉత్తరేణి ) వృక్షాలు, కదంబ , ఖర్జూర, రుద్రాక్ష , నాగ లింగ , వాటర్ ఆపిల్ , సీతాఫల , రామ ఫల , లక్ష్మణ ఫల , కొండమామిడి, స్వీట్నిమ్మ ,నక్షత్ర ఫలం , నారికేళ , మామిడి , ఉసిరి , పనస , సపోట , చీనీ , నిమ్మ , గజ నిమ్మ , దానిమ్మ , కమల , అంజూర్ , ద్రాక్ష , బదరి (రేగి) పోక మొదలైన వృక్ష సంపదతో ప్రకృతి సంపదకు ప్రత్యక్ష సాక్ష్యమై యున్నది ఈ ప్రదేశం.
ఈ వశిష్ఠాశ్రమంలో శ్రీ లలితాపీఠం ట్రస్టు ద్వారా హిందూ ధర్మప్రచారం సామూహిక పూజ, యజ్ఞకార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు,వేదాంతా గ్రంథముద్రణ,దేవతారాధన,గోపూజ మొదలైన కార్యక్రమాలు జరుగుతూ వుండగా, ఈ వశిష్ఠాశ్రమంలోనే ఏర్పరచిన శ్రీ విద్యాచారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యాన్నదానము,నిత్యప్రసాదవితరణము,గోసేవ,విద్యార్థుల చదువుకు సహకారం, ఉచిత వైద్యశిబిరముల నిర్వహణ,వానప్రస్తులకు ఆవాసము,వస్త్రదానాది సేవాకార్యక్రమాలు నిర్వర్తింపబడుతూ వుంటాయి.వశిష్ఠాశ్రమం ద్వారా జప,ధ్యాన,పారాయణ,ప్రవచన మొదలగు ఆధ్యాత్మిక సాధనా కార్యక్రమాలు నిర్వహింపబడుతూ వుంటాయి.