స్పటిక లింగం
శివుని శరీరము “ శుద్ధస్ఫటిక సంకాశం ” అని కీర్తింపబడింది.సాక్షాత్తు శివస్వరూపమైన స్ఫటికలింగాన్ని ఆరాధించి సేవిస్తే ముక్తిలభిస్తుందని శాస్త్రాలలో పేర్కొనబడింది.శివారాధన వికల్పాలలో విభిన్న వ్యక్తులు విభిన్న శివలింగాలని మాత్రమే పూజించాలని పురాణాలలో ప్రతిపాదిస్తూ స్పటిక లింగాన్ని మాత్రం స్త్రీ పురుష భేదం లేకుండా అందరు సేవించి పరమపదమును పొందవచ్చునని నిరూపింపబడింది.అట్టి శుద్ధ స్పటికలింగదర్శనం చేసుకునే భాగ్యం ఈ పీఠాన్ని దర్శించవచ్చిన భక్తులకు కలుగుతుంది సుమా!